విశాల్ తో శ్రియ 'పిస్తా'
విశాల్, శ్రియ హీరోహీరోయిన్లుగా జి.కె.ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మిస్తున్న 'పిస్తా' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. తమిళ ('తోరణై'), తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తొలిసారిగా ఈ చిత్రం ప్రోగ్రస్ ను చిత్రయూనిట్ శనివారంనాడు తెలియజేసింది.
విశాల్ మాట్లాడుతూ, రెండు భాషల్లోనూ ఈ చిత్రం నిర్మాణం జరుపుకోంటోందని చెప్పారు. నెలరోజుల పాటు హైద్రాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేశామనీ, త్వరలోనే షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనీ, అందుకు తగ్గట్టే ఆలీ, కృష్ణభగవాన్, కొండవలస వంటి పలువురు తెలుగు కమిడియన్లు ఇందులో నటిస్తున్నారనీ చెప్పారు. ప్రకాష్ రాజ్ కూ, తనకూ మధ్య చోటుచేసుకునే చోటుచేసుకునే సంఘటనలు, మైండ్ గేమ్స్ చాలా ఆసక్తిగా ఉంటాయన్నారు. అలాగే అందాల నటి శ్రియతో తొలిసారిగా తాను నటిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. ఈనెల 21న ఆడియో, మే 14న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. చాలాకాలం తర్వాత మళ్లీ హైద్రాబాద్ షూటింగ్ లో పాల్గొంటుండటం తనకెంతో సంతోషంగా ఉందని, చక్కటి వినోదం పాటు, మంచి రొమాంటిక్ ఫిల్మ్ ఇదనీ శ్రియ తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|