దర్శకుడిగా 'మంత్ర' రవిప్రకాష్
దర్శకులు నిర్మాతలుగా మారడం సహజం. అయితే అభిరుచి గల నిర్మాతలు అడపాదడపా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సందర్భాలు కూడా పరిశ్రమలో కనిపిస్తాయి. ఛార్మి కథానాయికగా 'మంత్ర' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని నిర్మించి, కథ-స్క్రీన్ ప్లే సైతం అందించిన రవిప్రకాష్ ఇప్పడు మెగాఫోన్ పట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
రవిప్రకాష్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న చిత్రానికి వినయ్ కథానాయకుడుగా ఎంపికయ్యారు. ఎంఎస్ రాజు స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'వాన' చిత్రం తర్వాత వినయ్ నటిస్తున్న రెండో చిత్రమిది. 'మంత్ర' చిత్రానికి పనిచేసిన యూనిట్టే ఈ చిత్రానికి కూడా పనిచేయబోతున్నారనీ, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామనీ రవిప్రకాష్ తెలిపారు. ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా మేడిన్ హిట్ సాధించాలనే పట్టుదలతో రవిప్రకాష్ ఉన్నారు.
Be first to comment on this News / Article!
|