'అధినేత' ఆడియో రిలీజ్
జగపతిబాబు మాట్లాడుతూ, ఇంతవరకూ పలు సినిమాల్లో చేనప్పటికీ ఈ చిత్రంలో చేయడానికి ముందు తనకు ధైర్యం సరిపోలేదనీ, ఇందులో 'అభ్యర్థి' అనే పదాన్ని పలకడానికి కూడా కష్టపడ్డాననీ జగపతిబాబు పేర్కొన్నారు. పరుచూరి సోదరులు పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారని చెప్పారు. నిర్మాతకు మంచి అభిరుచి ఉందనీ, భారీ బడ్జెట్ తో మూడు నెలల్లో సినిమా నిర్మించారనీ చెప్పారు. శ్రద్దాదాస్ ఎంతో కమిట్ మెంట్ తో నటించిందనీ, నీలిమ ప్రత్యేక క్యారెక్టర్ లో నటించిందనీ అన్నారు. సముద్ర చాలా కష్టపడి, తపనతో చేసిన సినిమా ఇదనీ, మ్యూజిక్ కూడా పెద్ద హిట్టవుతుదనే నమ్మకం తనకుందనీ అన్నారు. విలేజ్ గాళ్ గా ఇందులో నటించాననీ, చాలా స్టయిలిష్ మూవీ ఇదనీ శ్రద్ధాదాస్ పేర్కొంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారని, తెలుగు సినిమాలోని సెక్సీ హీరోల్లో జగపతిబాబు ఒకరనీ శ్రద్ధాదాస్ ప్రశిసంచారు. చిన్న పాత్ర అయినా కథకు కీలకమైన పాత్ర పోషించానని నీలిమ పేర్కొంది. ఎన్.శంకర్, రామ్ ప్రసాద్, సుంకు రమేష్, మహాదేవ్, కెవివి సత్యనారాయణ, అంజి శ్రీను, వెంకట్ అక్కినేని, హంసా నందిని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|