'ఊహాచిత్రం' పాటలు
వంశీ, కావేరీ ఝా జంటగా డాక్టర్ పెద వీర్రాజు సమర్పణలో లిఖిత్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.పైడిబాబు నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'ఊహా చిత్రం'. సత్య దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హోటల్ తాజ్ బంజారాలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో తరుణ్ ఆడియోను ఆవిష్కరించి డాక్టర్ కె.రవీంద్రనాద్ కు అందజేశారు. శివ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
దర్శకుడు సత్య మాట్లాడుతూ, తాను ఈ కథ తయారు చేసిన వెంటనే శివకు వినిపించి మంచి పాటలు రెడీ చేయమన్నాననీ, కథతో పాటు పాటలు కూడా విని ఎంతగానో నచ్చడంతో పైడిబాబు ఈ చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చారని తెలిపారు. పాటలతో పాటు సినిమా కూడా చాలా బాగా వచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాననీ చెప్పారు. చిత్ర సమర్పకుడు పెదవీర్రాజు మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా తన కుమారుడు వంశీ హీరోగా పరిచయమవుతున్నారనీ చెప్పారు. శివ మంచి సంగీతంతో అందించడంతో పాటు, దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు చాలా బాగుందని ప్రశంసించారు. దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో మంచి సంగీతం అందించే ప్రయత్నం చేశానని శివ తెలిపారు. ఈ చిత్రం ఆడియోతో పాటు సినిమా కూడా విజయవంతం కావాలని ఈ కార్యక్రమంలో పలువురు అభిలషించారు. డాక్టర్ పెదరాజు, హబీబుల్లా, వంశీ, కావేటీ ఝా, నవనీత్ కౌర్, దైవజ్ఞశర్మ, వేమూరి రాధాకృష్ణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|