ఈవారంలోనే 'నా స్టైలే వేరులే'
డాక్టర్ రాజశేఖర్, అందాల నటి భూమిక జంటగా దిసిర ప్రొడక్ష్సన్స్ పతాకంపై మాగంటి గోపీనాథ్ నిర్మిస్తున్న 'నా స్టైలే వేరులే' చిత్రం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. రామ్ ప్రసాద్ దర్శకుడు. ఈ వారంలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
కొన్ని సంఘటనలు కొంతమంత జీవన విధానాలు మార్చేస్తుంటాయనీ, ఒక సంఘటన కారణంగా ఇందులోని కథానాయకుడి జీవితంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటాయనీ, వాటిని వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుందనీ మాగంటి గోపీనాథ్ తెలిపారు. రాజశేఖర్ ఎంతో స్టయిల్ ష్ గా సినిమాలో కనిపిస్తారనీ, ఆయన కెరీర్ లో ఇదో మంచి చిత్రమవుతుందనీ అన్నారు. అలాగే భూమిక గ్లామర్ తో పాటు మంచి పెర్ ఫారమెన్స్ కు ఆస్కారమున్న పాత్రను పోషించారని తెలిపారు. కథ, కథనాలే ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అనీ, ఈ వారంలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. మే మొదటివారంలో సినిమా విడుదలవుతుందని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, విజయ్ కుమార్, దేవరాజ్, చలపతిరావు, గిరిబాబు, ఆహుతిప్రసాద్, అన్నపూర్ణ, సురేఖవాణి, రజిత తదితరులు నటించారు. దిసిర ప్రొడక్షన్స్ కథ, ఎస్.ఆరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అనూప్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|