'ఒక అమ్మాయి ఒక అబ్బాయి'
విశ్వాస్, రూపాకౌర్, లహరి హీరోహీరోయిన్లుగా కొత్త తరహా ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం 'ఒక అమ్మాయి ఒక అబ్బాయి'. సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అన్నీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అలెక్స్ వై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారం రాత్రి జరిగింది. రమేష్ ప్రసాద్ ఆడియో క్యాసెట్లను ఆవిష్కరించి తొలి ప్రతిని ఘంటాడి కృష్ణకు అందజేశారు. ఎన్.శంకర్ ఆడియో సీడీని ఆవిష్కరించి వై.ఎస్.మదన్ మోహన్ రెడ్డికి అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
ఇవాల్డి యువతరం కొత్తతరహా చిత్రాలను అందిస్తోందనీ, నిర్మాత అలెక్స్ కు సినిమారంగం పట్ల మంచి అభిరుచి ఉందనీ రమేష్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని పాటలన్నీ మెలోడియస్ గా ఉన్నాయనీ, సినిమా కూడా చక్కటి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. అందమైన లొకేషన్లలో తీసిన ఈ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనీ, రింగ్ టోన్స్ కు కూడా బాగుంటాయనీ ఎన్.శంకర్ పేర్కొన్నారు. వరికుప్పల సాహిత్యం తరహాలోనే ఈ చిత్ర సంగీతం కూడా హృదయానికి దగ్గరగా ఉందని ఘంటాడి కృష్ణ ప్రశంసించారు. నిర్మాత అలెక్స్ మాట్లాడుతూ, తాను గతంలో 'ఖాకీచొక్కా', 'అశోకచక్రం' వంటి మాస్ సినిమాలు తీశాననీ, ఇది క్లాస్ చిత్రమనీ చెప్పారు. 'తిన్నామా పడుకున్నామా తెల్లారిందా' చిత్రం తర్వాత దర్శకుడిగా తనకిది రెండో సినిమా అని రామ్ కుమార్ తెలిపారు. సస్పెన్స్ మిళితమైన ప్రేమకథా చిత్రమిదనీ, తప్పనిసరిగా ప్రేక్షకాదరణ చూరగొంటుందనీ అన్నారు. దర్శకనిర్మాతల ప్రోత్సాహంతో మంచి సంగీతం అందించగలిగానని వరికుప్పల యాదగిరి తెలిపారు. హీరో విశ్వాస్, హీరోయిన్ రూపాకౌర్, రచయితలు ఘటికాచలం, జి.వి.అమరేశ్వరరావు, నటుడు గుండు హనుమంతరావు, రాజేంద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|