ఆదిత్య దర్శకత్వంలో తరుణ్
'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఇటీవల కాలంలో సరైన హిట్ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎం.ఎస్.రాజు నిర్మించిన 'ఆట' చిత్రం తర్వాత వి.ఎన్.ఆదిత్య నిర్మాతగా కూడా మారి 'రెయిన్ బో' అనే చిత్రాన్ని ఇటీవల నిర్మించారు. మంచి అభిరుచితో తీసిన సినిమా అయినప్పటికీ స్టార్ కాస్ట్ లోపాలు, సరైన సీజన్ లో సినిమా రిలీజ్ కాకపోవడం వంటి కారణాల వల్ల సినిమా ప్రేక్షకులకు చేరలేదు. దీంతో ఆదిత్య కొద్ది గ్యాప్ తీసుకుని తాజాగా బయట బ్యానర్ లో మెగాఫోన్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆయన డైరెక్షన్ లో తరుణ్ హీరోగా సుప్రీమ్ మ్యూజిక్ అధినేత రాజు హిర్వాణి ఓ కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజు హిర్వాణి గతంలో మంచు విష్ణువర్దన్ హీరోగా 'అస్త్రం' అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈసారి తరుణ్ చిత్రాన్ని ప్రణవ్ స్టూడియోకు చెందిన గోగినేని శ్రీనివాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు.
'శశిరేఖా పరిణయం' చిత్రం తర్వాత తరుణ్ కమిట్ అయిన చిత్రం ఇదే కావడం విశేషం. తొలుత ఈ చిత్రానికి రాజ్ ఆదిత్యను దర్శకుడిగా ప్రకటించారు. అయితే రాజ్ ఆదిత్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ప్లేస్ లో వి.ఎన్.ఆదిత్య కు దర్శకత్వ పగ్గాలు అప్పగించారు. మలేసియా బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం ఉంటుందనీ, ఈనెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి తేచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|