రవితేజ 'ఆంజనేయలు' స్టార్ట్
క్రేజీస్టార్ రవితేజ, అందాల నటి నయనతార హీరోహీరోయిన్లుగా పరమేశ్వర్ ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న 'ఆంజనేయులు' చిత్రం ఈనెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. రవికిరణ్ బాబు సమర్పణలో 'యువత' ఫేమ్ పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కునుంది.
గణేష్ బాబు ఆ వివరాలను తెలియజేస్తూ, రవితేజ కెరీర్ లోనే ఇది ఓ సెన్సేషనల్ మూవీ అవుతుందనీ, పరశురామ్ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనీ తెలిపారు. రవితేజ-నయనతార కాంబినేషన్ సంచలనం సృష్టిస్తుందని అన్నారు. ఈనెల 20 నుంచి మే 9 వరకూ హైద్రాబాద్ లో షెడ్యూల్ చేస్తామనీ, మే 12 నుంచి 25 వరకూ విదేశాల్లో సాంగ్స్ చిత్రీకరణకు ప్లాన్ చేశామనీ చెప్పారు. జూన్ లో షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఈ భారీ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ, సన, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, కె.రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ, మార్కాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, చిన్నా ఆర్ట్, ఎస్.థామస్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|