విదేశాల్లో 'రైడ్' సాంగ్స్
నాని ('అష్ట చమ్మా' ఫేమ్), తనీష్ (నచ్చావులే), శ్వేతబసుప్రసాద్ ('కొత్త బంగారులోకం') హీరోహీరోయిన్లుగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'రైడ్'. రమేష్ వర్మ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని వివిధ లొకేషన్లలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఆదివారం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్లో ఓ పాటను చిత్రీకరించనున్నట్టు నిర్మాత సురేష్ తెలిపారు.
'రైడ్' చిత్రం తుది మెరుగుల దశలో ఉందనీ, అన్నపూర్ణా స్టూడియోస్ లో పాట చిత్రీకరణ అనంతరం బ్యాలన్స్ ఉన్న 3 పాటలను విదేశాల్లో తీయనున్నాననీ ఆయన చెప్పారు. మే నేలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా గాయకుడు హేమచంద్రను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. మాస్, మెలోడో, ఫ్రెండ్ షిప్ వంటి పాటలకు ఆయన అందజేసిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంద్నారు. తమ సంస్థ తదుపరి చిత్రంలోనూ ఆయన అవకాశం కల్పించనున్నామనీ చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని హీరో నాని తెలిపారు. 'నచ్చావులే' మాదిరిగా ఈ చిత్రం కూడా తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే గట్టి నమ్మకం ఉందని తనీష్ పేర్కొన్నారు. ఇద్దరు స్నేహితుల కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు
తెరకెక్కిస్తున్నారని చెప్పారు. 'కొత్త బంగారులోకం' తర్వాత ఈ చిత్రంతో తన కెరీర్ మరింత ముందుకు వెళ్తుందని శ్వేతబసుప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ధర్మవరపు, ఆహుతిప్రసాద్, కాశీ విశ్వనాథ్, తులసి, సుధ, కిన్నెర, హేమ, ఆదర్స్. సత్యం రాజేష్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. రమేష్ వర్మ కథ, శశాంక్ వెన్నెలకంటి మాటలు, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటంగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|