ఎ డిఫరెంట్ లవర్ 'రోమియో'
ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా, శ్రీహరి ముఖ్య పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రోమియో'. దీనికి 'ఎ డిఫరెంట్ లవర్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. సుధ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం ఇటీవల రెండు పాటలు కూడా చిత్రీకరించడంతో సినిమా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.
శ్రీహరి మాట్లాడుతూ, ఇందులో అనిల్ అంబానీ వంటి ఓ ధనవంతుడైన వ్యక్తి పాత్రను పోషించాననీ, కథానాయిక అయిన తన చెల్లెలి ప్రేమను హీరో ఎలా పొందగలిగాడన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. దర్శకుడు చెప్పినదానికంటే ఈ సినిమాను బాగా మలిచారనీ, ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించే చిత్రమిదనీ అన్నారు. రీరికార్డింగ్ పూర్తయిందనీ, డిటిఎస్ మిక్సింగ్ మొదలుపెట్టామనీ నిర్మాత శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ నెలాఖరులోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం ఇటీవల తీసిన రెండు పాటల్లో ఒకటి ఐటెం సాంగ్ అనీ, మరొకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనీ చెప్పారు. శ్రీహరి, రాజేష్ తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారనీ, శ్రీహరికి ఆపోజిట్ గా విలన్ పాత్రల్లో చరణ్ రాజ్, శ్రీహరి పిఎగా రఘుబాబు నటించారనీ చెప్పారు. పాటలతో పాటు మంచి ఫైట్స్ కూడా సినిమాలో ఉన్నాయన్నారు. ఇది తన రెండో చిత్రమనీ, సంప్రదాయానికి గౌరవ మిచ్చి ప్రేమ పట్ల నమ్మకం కలిగిన అమ్మాయి పాత్ర పోషించాననీ హీరోయిన్ శ్రద్ధాదాస్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సంతోష్ పవన్, సైరాబను తదితరులు నటించారు.
వనమాలి పాటలు, రాజేంద్ర సినిమాటోగ్రఫీ, శంకర్ ఎడిటింగ్, గణేష్ ఫైట్స్, అగస్త్య సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|