మేలో సిద్దార్ధ 'ఓయ్'
లవర్ బాయ్ ఇమేజ్ తో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న యువ కథానాయకుడు సిద్దార్ధ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తర్వాత మళ్లీ మూడు నెలల వ్యవధిలో ప్రేక్షకులను 'ఓయ్' అంటూ పలకరించబోతున్నారు. సిద్దార్ధ కథానాయకుడుగా రూపొందుతున్న 'ఓయ్' చిత్రాన్ని
యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆనంద్ రంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలనటిగా ఎన్నో సంచనల విజయాలను దక్కించుకున్న షామిలి ('అంజలి' ఫేమ్) ఈ చిత్రం ద్వారా తొలిసారి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు పాటల చిత్రీకరణ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు నిర్మాత దానయ్య తెలిపారు.
మే మొదటివారంలో రెండు పాటలు ఆస్ట్రేలియాలోనూ, మరో పాట చెన్నైలోనూ చిత్రీకరించనున్నట్టు ఆయన తెలిపారు. సిద్దార్ధ సరసన షామిలిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామనీ, స్క్రీన్ పై ఈ జంట ప్రేక్షకులకు కనువిందు చేయనుందనీ చెప్పారు. యూత్ ఫుల్ రొమాంటింగ్ ఎంటర్ టైనర్ గా, ఎంతో పొయిటిక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ తెరకెక్కించారనీ, క్లైమాక్స్ చాలా స్పెషల్ గా ఉంటుందనీ అన్నారు. సినిమా థీమ్ కు తగ్గట్టుగా యువన్ శంకర్ రాజా యూత్ ఫుల్ ట్యూన్స్ అందించారనీ, మే మొదటి వారంలో ఆడియో, అదే నెలాఖరులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|