రాముడు...అర్జునుడు
ఇవాల్టి యంగ్ జనరేషన్ హీరోల్లో 'దేవదాసు' హీరో రామ్ తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా పేరుతెచ్చుకున్నారు. ఇటీవల 'రెడీ' చిత్రంతో మరో హిట్ కొట్టి ప్రస్తుతం స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్లు ఉన్నప్పటికీ వరుస హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుతో తన తదుపరి చిత్రానికి కమిట్ అయ్యారు. దీనికి 'రామ రామ కృష్ణ కృష్ణ' అనే వర్కింగ్ టైటిల్ ను నిశ్చయించారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రకు యాక్షన్ కింగ్ అర్జున్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
అర్జున్ కు తెలుగు ప్రేక్షకులలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు 'మా పల్లెలో గోపాలుడు', 'మన్నెంలో మొనగాడు' వంటి స్ట్రయిట్ తెలుగు చిత్రాల్లో నటించిన అర్జున్ ఆ తర్వాత తమిళంలో బిజీ అయ్యారు. 'జెంటిల్ మన్ ', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాల్లో తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించాయి. 'హనుమాన్ జంక్షన్', 'స్వాగతం' వంటి చిత్రాలతో నటించిన అర్జున్ ఆమధ్య 'శ్రీ ఆంజనేయం' చిత్రంలో ఆంజనేయుడి పాత్రలోనూ అలరించారు. తాజాగా దిల్ రాజు చిత్రంలో అర్జున్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. జూలైలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|