జీవన మధురిమల 'యు & ఐ'
ఆయన నా కోసమే పుట్టారు....
తెలుగునాట పుట్టి మాతృభూమికి సేవలందిస్తూనే, అమెరికాలో తెలుగువారి కీర్తి బావుటాను ఎగురవేస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతా వాది రవీందర్ తోట అనీ, ఆయన ప్రోత్సాహం, ఆశీస్సులతోనే తాను దర్శక పగ్గాలు చేపట్టానని చెబుతూ 'నా కోసమే ఆయన పుట్టారనిపిస్తుంది' అంటూ రంజిత్ బెల్లూరి తన కృతజ్ఞతలను తెలియజేశారు. ఆయన సినిమా తీయాలనే ఆలోచన చేసినప్పుడు దర్శకుడు కావాలన్న తన ఆలోచనను ఆయనకు చెప్పాననీ, తొలి పరిచయంలోనే మనం సినిమా తీస్తున్నామంటూ వెన్నుతట్టి ముందుకు నడిపించారనీ, ఆయన నమ్మకాన్ని వమ్ము చేకుండా అనుకున్న బడ్జెట్ లిమిట్స్ లో, అనుకున్న విధంగా సినిమా కంప్లీట్ అవుతోందన్నారు. తప్పనిసరిగా ఇది మంచి క్వాలిటీ ఫిల్మ్ గా ఉంటుందనీ, ఇందులోని ఓ 'సెన్సిటివ్ పాయింట్ ' జనరంజకంగా చెప్పే ప్రయత్నం చేశామనీ, అది సూటిగా యూత్ కు రీచ్ అయితే చాలా పెద్ద హిట్ కావడంతో పాటు, క్వాలిటీ తెలుగు సినిమాలకు ఈ చిత్రం నిశ్చయంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సినిమా మూడొంతులకు పూర్తయిన తర్వాతే అవుట్ పుట్ చూసి ప్రమోషన్ కు వెళదామని అనుకున్నామనీ, దాదాపు సినిమా పూర్తి కావచ్చిందనీ, చాలా అద్భుతంగా వచ్చిందనీ చెప్పారు. వచ్చే నెలలో ఆడియో ప్లాన్ చేసి, జూన్ లో సినిమా రిలీజ్ చేయాలని తానూ, నిర్మాత రవీందర్ తోట ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అంతా కొత్త తారలు నటిస్తున్న ఈ చిత్రానికి రంజిత్ బెల్లూరి కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం అందించారు. యశోదా దేవి సమర్పకురాలిగా వ్యవహరించారు. మధు రెబ్బ కళాదర్శకత్వం, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్ అందజేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|