నమిత 'దేశద్రోహి' షురూ
నమిత ప్రధాన పాత్రలో శ్రీదేవి సినీచిత్ర పతాకంపై జి.వి.హెచ్.ప్రసాద్ రావు నిర్మిస్తున్న చిత్రం 'దేశద్రోహి'. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకుడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. నమిత, విలన్ పాత్రధారి శాంతిచంద్రలపై తీసిన ముహూర్తం సన్నివేశానికి ఐపిఎస్ అధికారి గోపీనాథరెడ్డి క్లాప్ ఇచ్చారు. ఫిలిం చాంబర్ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు స్విచ్చాన్ చేశారు.
దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన సినిమాలలో మంచి కథతో పాటు సందేశం ఉంటుందనీ, ఇది కూడా సాంఘిక ప్రయోజనంతో కూడుకున్న సినిమా అనీ చెప్పారు. నమిత పాత్ర చాలా కొత్తదనంతో ఉంటుందనీ, ఫైట్ సన్నివేశాలు స్వయంగా చేసేందుకు నమిత ఆసక్తి చూపుతున్నారనీ తెలిపారు. గతంలో విజయశాంతితో తన దర్శకత్వంలో 'శాంభవి', 'వైజయంతి' వంటి చిత్రాలు వచ్చాయనీ, ఖాకీ డ్రెస్ లో విజయశాంతి ఎలా నటిస్తారో నమితను కూడా ఆ రేంజ్ లో చూపబోతున్నామని చెప్పారు. గతంలో విజయశాంతితో మూడు సినిమాలు చేసినట్టు నిర్మాత ప్రసాద్ చెప్పారు. నమితను కూడా అదే స్థాయిలో చూపించబోతున్నామని పేర్కొన్నారు. ఇందులోని పాత్ర కోసం నమిత చాలా మటుకు బరువు తగ్గారని చెప్పారు. ఒక ప్రముఖ హీరో ఇందులో నటించనున్నారనీ, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తామని అన్ారు. ఈనెల26 వరకూ తొలి షెడ్యూల్ జరుగుతుందనీ, జూనై 16 నుంచి 30 వరకు, ఆ తర్వాత జూలై 18 నుంచి 30 వరకూ జరిగే షెడ్యూల్స్ తో సినిమా పూర్తవుతుందన్నారు. ఆగస్టులో సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పారు. తొలిసారిగా ఈ చిత్రం పోలీసు అధికారిగా నటిస్తున్నాననీ, శక్తివంచన లేకుండా తన పాత్రకు న్యాయం చేస్తాననీ నమిత చెప్పారు. వ్యాయామం, యోగా ద్వారా బరువు తగ్గినట్టు చెప్పారు. 'త్రీ' చిత్రం తర్వాత తాను నటిస్తున్న సినిమా ఇదనీ, పూర్తి స్థాయి పాత్ర అనీ శాంతిచంద్ర తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, రామిరెడ్డి, కృష్ణ భగవాన్, కోవై సరళ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి సినీ చిత్ర యూనిట్ కథ, కిషన్ సాగర్ సినిమాటోగ్రఫీ, రాంబాబు ఎడిటింగ్, ఫవర్ ఫ్సాట్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|