'నాస్టైలే వేరు' మార్కెట్ లోకి
డాక్టర్ రాజశేఖర్, భూమిక ప్రధాన జంటగా రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న స్టయిలిష్ మూవీ 'నా స్టైలేవేరు'. దిసిర ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి గోపీనాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్రం ఆడియోను సోమవారంనాడు నేరుగా మార్కెట్ లోకి విడుదల చేశారు. హైద్రాబాద్ లోని డిఎఆర్ స్టూడియోస్ లో రామ్ ప్రసాద్ ఆ వివరాలను తెలియజేశారు.
ఈ చిత్రంలో ఒక్కో పాత్రది ఒక్కో రకమైన స్టైల్ ఉంటుందనీ, అందుకే కథకు తగ్గట్టుగా ఈ చిత్రానికి ఆ పేరు పెట్టామనీ ఆయన తెలిపారు. రాజశేఖర్, భూమిక, బ్రహ్మానందం, ఆలీ...ఇలా ఒక్కో పాత్ర ఒక్కో స్టయిల్ లో ఉంటుందనీ, కథ చాలా గమ్మత్తుగా ఉంటుందనీ చెప్పారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రాజశేఖర్ పాత్ర ఉంటుందన్నారు. భూమిక మంచి నటన ప్రదర్శించారనీ, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని మే మొదటివారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి అడియో విడుదల చేశామనీ, అనూప్ అందించిన సంగీతం వీనులవిందుగా ఉంటుందనీ తెలిపారు. ఇందులో ఐదు పాటలు సందర్భోచితంగా ఉంటాయని అనూప్ తెలిపారు. రెండు పాటలు తాను రాసినట్టు భాస్కరభట్ల పేర్కొనగా, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటను తాను రాసినట్టు చిర్రావూరి విజయ్ కుమార్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వేణుమాధవ్, విజయ్ కుమార్, దేవరాజ్, చలపతిరావు, గిరిబాబు, ఆహుతి ప్రసాద్ తదితరులు నటించారు. దిసిర ప్రొడక్షన్స్ కథ, ఎస్.అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు
Be first to comment on this News / Article!
|