'గోపి గోపిక గోదావరి' రెడీ
క్రియేటివ్ డైరెక్టర్ వంశీ మరోసారి 'గోపి గోపిక గోదావరి' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సమ్మర్ ను టార్గెట్ చేసుకున్నారు. వేణు, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా ఆనంది ఆర్ట్స్ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. తొలిసారిగా ఆ విశేషాలను నిర్మాత వల్లూరి పల్లి రమేష్ తెలియజేశారు.
వంశీ దర్శకత్వంలో గతంలో ఇదే బ్యానర్ లో వచ్చిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందేననీ, ఆ కోవలేనే ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తమకుందని రమేష్ తెలిపారు. వంశీ సినిమాల్లో సహజంగా కనిపించే గోదావరి అందాలు ఈ చిత్రంలో మరింత అందగా కనిపిస్తాయని చెప్పారు. పోలవరం, గోదావరి, పాపికొండలు, సింగన్నపల్లి రేవు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామన్నారు. ముఖ్యంలో సింగన్నపల్లి రేవులో వేసిన భారీ సెట్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈసెట్ లో పాట చిత్రీకరణతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా తీశామని చెప్పారు. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయనీ, అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు. ఇదే నెలలో ఆడియో, మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, కొండవలస, జీవా, కల్యాణ్, జయలలిత, గీతాంజలి, సన, పిళ్లా ప్రసాద్ తదతరులు తారాగణం. రామజోగయ్య శాస్త్రి పాటలు, బి.లోకేశ్వరరావు సినిమాటోగ్రఫీ, బసవ పైడిరెడ్డి ఎడిటింగ్, చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|