ప్రియమణి 'తూటా'
'ద్రోణ' చిత్రంతో బికినీతో ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేసిన ప్రియమణి ఈసారి పోలీసు అధికారిగా 'తూటా' ఎక్కుపెడుతోంది. జీవన్, ప్రియమణి నాయకానాయికలుగా తమిళంలో రూపొందిన 'తూటా' (బుల్లెట్) చిత్రం ఇప్పుడు అదే పేరుతే తెలుగులో అనువాదమవుతోంది. ఈ చిత్రానికి సెల్వం దర్శకుడు. సీతారామా ఫిల్మ్స్ పతాకంపై వి.పద్మాకరరావు, జడ్చర్ల నాగరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
తమిళంలో విడుదలైన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకొందనీ, తెలుగు వెర్షన్ కు సంబంధించి డబ్బింగ్, సౌండ్స్ మిక్సింగ్ తదితర కార్యక్రమాల పూర్తి చేశామనీ పద్మాకరరావు తెలిపారు. నెలాఖరుకి తొలికాపీ వస్తుందనీ, సెన్సార్ పూర్తి చేయించి మే నెలలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. మరో నిర్మాత నాగరాజు మాట్లాడుతూ, ఇగి పూర్తి యాక్షన్ కథా చిత్రమని చెప్పారు. ఒక పోలీసు అధికారి అనాథ బిడ్డను చేరదీసి గూండాయిజం, రౌడీయిజం వంటివాటిలో తర్ఫీదు ఇచ్చి తాను చేయాలనుకున్న పనులు ఆ కుర్రాడితో చేయిస్తాడనీ, అయితే ఓ సంఘటనతో కనువిప్పు కలిగిన ఆ కుర్రాడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. ఇందులో ప్రియమణి ఇన్ స్పెక్టర్ గా నటించిందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్ రెడ్డి మాటలు, వనమాలి పాటలు, సురేంద్రనాథ్ రెడ్డి ఎడిటింగ్, దళపతి శ్రీను పైట్స్, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|