రవితేజ గుట్టురట్టు
ఆలస్యంగా హీరో అయిన రవితేజ ఇవాల్టి యంగ్ హీరోలకు కూడా అందని స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఆయన డైలాగ్స్ లో స్పీడ్ ఎక్కువంటూ మొదట్లో అంతా అనుకున్నా అదే స్పీడ్ ను ఆయన కంటిన్యూ చేస్తూ జనాలకు అలవాటు చేశారు. ఇప్పుడు అదే ఒక స్టయిల్ అయింది. ఓవైపు ఎంటర్ టైన్ మెంట్, మరో వైపు యాక్షన్ రెండూ మిక్స్ చేసి ప్రేక్షకులను ఒప్పించడం ఏ హీరోకైనా కత్తిమీద సామే. అయితే ఈ రెండింటినీ సమర్ధవంతంగా పండించడంలో రవితేజ తిరుగులేదనిపించుకుంటున్నారు. 'విక్రమార్కుడు', 'కృష్ణ' వంటి చిత్రాలు ఆయన రేంజ్ ను పెంచితే, ప్రస్తుతం నటిస్తున్న 'కిక్' మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. మరోవైపు 'ఆంజనేయులు' చిత్రంలో నటిస్తున్నారు. వంశీ, కృష్ణవంశీ వంటి డైరెక్టర్లు కూడా రవితేజతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. లేటు వయసులో హీరో అయిన రవితేజకు ఇంత ఎనర్జీ ఎక్కడిది? అసలు ఆయన గ్లామర్ రహస్యం ఏమిటి?. అదే విషయాన్ని యువహీరో నితిన్ ఆయనను ఇటీవల నిలదీసి మరీ తెలివిగా జవాబు రాబట్టారు. 'కిక్' ఆడియో ఫంక్షన్ లో నితిన్ ఇదే అంశం ప్రస్తావిస్తూ, నా వంటి యువహీరోలంతా సిక్స్, ఎయిట్ ఫ్యాక్స్ అంటూ ఎక్స్ ర్ సైజులు చేస్తుండటంతో ముఖాలు పీక్కుపోతున్నాయి. రవితేజ మాత్రం రోజురోజుకూ గ్లామర్ పెంచుకుంటూ పోతున్నారు. ముఖంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఆ గ్లామర్ రహస్యం ఏమిటో ఆయన చెబితే బాగుండును...అంటూ నితిన్ ఓ రిక్వెస్ట్ చేశారు.
రవితేజ తన సహజమైన స్టయిల్ లో ఓ నవ్వు విసిరినప్పటికీ నితిన్ పట్టుబట్టడంతో 'ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోను. మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకుంటాను. అదే ముఖంలో ప్రతిబింబిస్తుంది. సో సింపుల్' అంటూ తేల్చేశారు. ఖర్చులేని పనే కాబట్టి మనం కూడా అలా ఫాలో అయిపోతే పోలా?!
Be first to comment on this News / Article!
|