సుమంత్ 'బోణి' పాటలు
అమెరికాలో ఉద్యోగం చేసినప్పటికీ ఎప్పుడూ దర్శకత్వం వైపు తనకు మక్కువ ఉండేదనీ, అది ఈ చిత్రం ద్వారా నేరవేరడం సంతోషంగా ఉందనీ రాజ్ పిప్పళ్ల పేర్కొన్నారు. ఆవకాయ పచ్చడి ఎలా వివిధ వస్తువుల మిశ్రమమో ఇందులోని పాటలు కూడా ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని నిర్మాతల్లో ఒకరైన అనిత అన్నారు. ఇందులో ఆరు పాటలు రాసే అవకాశం కలిగిందని రామజోగయ్య శాస్త్రి పేర్కొన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ, సహజంగా ఆడియో ఫంక్షన్లు స్టూడియోల్లో జరుగుతుంటాయనీ, వాటికి భిన్నంగా ఈ వేడుక ఇక్కడ జరగడం ఆనందంగా ఉందనీ అన్నారు. సినిమా కోసం యూనిట్ ఎంతో కష్టపడిందనీ, తన గత సినిమా విడుదలై ఏడాదిన్నర అయిందనీ అన్నారు. ఆ లోటును భర్తీ చేస్తూ ఇక వరుస సినిమాలు చేయాలనుకుంటున్నాననీ నవ్వుతూ అన్నారు. ఆదిత్య అధినేతల్లో ఒకరైన సుభాష్ గుప్తా, రమణ గోగుల సతీమణి నిక్కీ గోగుల, నటి కృతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|