ప్రేమికుల 'జోరు'
ప్రేమలో పడినప్పుడు జోరు సహజం. సరికొత్త ప్రేమకథా ఇతివృత్తంగా 'జోరు' చిత్రం రూపొందుతోందనీ చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు.గతంలో 'కల్యాణప్రాప్తిరస్తు', 'రియల్ స్టోరీ' వంటి చిత్రాలను నిర్మించిన ఎస్.మల్లేషం తన కుమారుడు అరవింద్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా టాకీస్ పతాకంపై ఈ తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నగేష్ దర్శకుడు. అరవింద్ కుమార్ కు జోడిగా ఆకర్ష నటిస్తోంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. జాబ్లీహిల్స్ లోని ఓ గెస్ట్ హౌస్ లో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ లో చిత్రయూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.
మంగళవారంతో ఒక పాట చిత్రీకరణ మినహా మిగతా షూటింగ్ పూర్తయిందని నిర్మాత తెలిపారు. మే రెండో వారంలో ఆడియో, చివరి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దర్శకుడు నగేష్ మాట్లాడుతూ, ఇది కొత్త తరహా ప్రేమకథా చిత్రమని చెప్పారు. కథానుగుణంగా బ్యాలెన్స్ పాటను ముంబైలో ప్లాన్ చేశామనీ, మరోవైపు నిర్మాణంతర కార్యక్రమాలు కూడా చురుకుగా జరుగుతున్నాయనీ తెలిపారు. ఇందులో తాను గ్రామీణ యువకుడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నట్టు హీరో అరవింద్ కుమార్ తెలిపారు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర తనదనీ, సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుందనీ ఆకర్ష తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయికుమార్, ఎల్బీ శ్రీరామ్, వైజాగ్ ప్రసాద్, హరిప్రసాద్, గుండు హనుమంతరావు, మేల్కొటి, గీతాంజలి, సన, సైరాభాను తదితరులు నటిస్తున్నారు. మరుధూరి రాజా మాటలు, వి.జయరాం సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|