సాగర్ లో 'పాండవులు'
యతిరాజ్, రాఘవ, తడివేలు, భాను, భగవాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'పాండవులు'. దీనికి 'వీళ్లు బాగా రన్నింగ్ చేస్తారు' అనే ట్యాగ్ లైన్ ఉంది. శాంకరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.ఎస్.నాయుడు దర్శకత్వంలో ఎన్.లక్ష్మణరావు, వై.శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యుల్ నాగార్జున సాగర్ లో జరుపనున్నట్టు దర్శకుడు తెలిపారు.
రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలని కలలు గనే ఆరుగురు కుర్రాళ్ల కథ ఇదని చెప్పారు. ఈనెల 25 నుంచి నాగార్జున సాగర్ లో జరుపనున్న షెడ్యూల్ లో ఆలీ, వేణుమాధవ్, అభినయశ్రీ. రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని చెప్పారు. మే మొదటివారంలో ఆడియో, జూన్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|