'చలో వన్..టూ..త్రీ..'
శివాజీరాజా, సాయికిరణ్, జైరమేష్, కీర్తి ప్రధాన పాత్రధారులుగా బేబి శ్రీహిత సమర్పణలో ఎస్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'చలో వన్..టూ..త్రీ..'. వెంకటరామ్ పల్లా దర్శకత్వంలో అల్లాడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైనట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టరీ అనీ, పేరుకు తగినట్టుగానే ఇందులో ముగ్గురు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటుందనీ అల్లాడి శ్రీనివాసరావు తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమ, కామెడీ, సస్పెన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రం ఉంటుందనీ, ముఖ్యంగా కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందనీ చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామనీ తెలిపారు
Be first to comment on this News / Article!
|