దేవదాసి కథతో 'ప్రణాళి'
నర్గీస్, ఉపేంద్ర లిమాయే, సుధాచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ప్రణాళి'. ఆ చిత్రం ఇప్పుడు అదే పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. విక్టరీ ఫిలింస్ టి.దుర్గారావు సమర్పణలో విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం అనువాదమవుతోంది. ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దేవదాసి ఆచారానికి బలైన ఓ మహిళ కథతో రూపొందిన చిత్రమిదని సమర్పకుడు దుర్గారావు తెలిపారు. సంఘాన్ని ఎదిరించి తన బిడ్డకు చదువు చెప్పేందుకు ఆ మహిళ ఎలాంటి కష్టాలు పడిందనేది ఈ చిత్రంలో ఆవిష్కరించారని ఆయన పేర్కొన్నారు. మేలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రామన్ ట్రినా, వినయ్ ఆప్టే, హేమంత్ పాండే, సుజాత సెగల్, సూజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి చైతన్యబోస్ ఎడిటింగ్, కైలాష్-నరేష్ సంగీతం, హిర్దేశ్ కాంబ్లీ దర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
|