లారెన్స్ 'రాజాధిరాజా'
లారెన్స్ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం 'రాజాధిరాజా'. శక్తి చిదంబరం దర్శకుడు. కామ్న జెఠ్మలానీ, సిగ్ధ, మీనాక్షి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీదేవి పిక్చర్స్ పతాకంపై వి.నాగేశ్వరరెడ్డి సమర్పణలో ఎస్.రామిరెడ్డి, డాక్టర్ శరత్ చంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 2వ వారంలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్ర నిర్మాణం జరిగిందనీ, ఎంతోమంది నిర్మాతలు పోటీపడినప్పటికీ ఫ్యాన్సీ ఆఫర్ తో ఈ సినిమా హక్కులను తాము పొందామని నిర్మాతలు తెలిపారు. లారెన్స్ తన గత చిత్రాలకంటే మంచి పరిణతి చెందిన నటన ప్రదర్శించారనీ, ఒక గ్రూప్ సాంగ్ తో పాటు డ్యూయెట్లు కూడా బాగా వచ్చాయనీ చెప్పారు. ముంతాజ్ విలన్ పాత్రలో నటించడం ఓ విశేషమని తెలిపారు. కరుణాస్ మంచి సంగీతం అందించారనీ, రెండు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనీ వారు పేర్కొన్నారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, భువనచంద్ర-వెన్నెలకంటి పాటలు, కణల్ కన్నన్ ఫైట్స్ అందించారు. హెచ్.శ్రీధర్ నిర్మాణ సారథ్యం వహించారు.
Be first to comment on this News / Article!
|