పలు చిత్రాల్లో ప్రతినాయకుడుగా సుపరిచితుడైన అజయ్ ఇప్పుడు 'ఆ..ఒక్కడు' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నారు. టాలీ టూ హాలీ ఫిలిమ్స్ నిర్మిస్తున చిత్రం 'ఆ..ఒక్కడు'. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడు. 'పది మందిలో ఒక్కడిని గుర్తించేటప్పుడు 'ఆ.. ఒక్కడు' అంటూంటాం. అలాంటి ఆ ఒక్కడు ఏం చేశాడన్నదే ఈ చిత్ర కధాంశమని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. సినిమా ఆద్యంతం ఆకట్టుకునే అన్ని అంశాలను మిళతం చేసి ప్రత్యేకంగా యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రం తీశామన్నారు. హీరోయిన్ గా మధురిమ నటిస్తోందని ఆమెకిదే తొలి తెలుగు చిత్రమని తెలిపారు. మా సినిమా స్టిల్స్ చూసి ఆమెకు చాలా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయని అన్నారు. ఇంకా మలయాళ స్టార్ సురేష్ గోపి ప్రత్యేక పాత్రలో లాయర్ గా నటిస్తున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ తదితరులు తమ హాస్యరసాన్ని పండించనున్నారని పేర్కొన్నారు.