జగన్మోహిని షూటింగ్ పూర్తి
రాజా హీరోగా, నమిత టైటిల్ పాత్రలో మురళీ సినీ క్రియేషన్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మిస్తున్నసోషియో ఫాంటసీ కథాచిత్రం 'జగన్మోహిని'. రామోజీ ఫిలింసిటీలో వారం రోజుల పాటు గ్రాఫిక్ వర్క్ సన్నివేశాలను పూర్తిచేసుకోవడంతో షూటింగ్ పార్ట్ ముగిసింది. రాజా, నమిత, మీరాచోప్రా తదితర ప్రధాన తారాగణంపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లో సినిమా విడుదల అవుతుందని నిర్మాత తెలిపారు. హైదరాబాద్, తలకోన, పుత్తూరు, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని చెప్పారు. గతంలో జయమాలిని నటించిన జగన్మోహిని చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆలరింపజేసిందని, ఆ టైటిల్ ను మాత్రమే తీసుకుని కొత్త కధాంశంతో తెరకెక్కిస్తున్నామనీ, గ్రాఫిక్స్ కు హైలెట్ గా నిలుస్తాయని చెప్పారు. యువరాజుగా రాజా, రాజుమదన్ బాబు సోదరిగా మీరాచోప్రా, రాజా తండ్రిగా నరసింహరాజు, మాంత్రికుడిగా కోట శ్రీనివాసరావు నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|