దంచవే మేనత్త కూతురా...
భార్గవ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన మంగమ్మగారి మనవడు చిత్రంలోని దంచవే మేనత్త కూతురా... వడ్లు దంచవే నా గుండెలదరా అనే పాట గతంలో ఓ సంచలనం సృష్టించిన సంగతి విదితమే, కాగా ఆ పాటను రైడ్ చిత్రం కోసం రీ మిక్స్ చేసినట్లు తెలిసింది. నానీ, తనీష్, శ్వేతబసుప్రసాద్ లు హీరోహీరోయిన్లుగా శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ వర్మ దర్శకత్వంలోని బెల్లంకొడ సురేష్ నిర్మిస్తున్న 'రైడ్' చిత్రం చాలాభాగం పూర్తి చేసుకొంది. హైదారాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన సెట్లో ఓ పాటను చిత్రీకరించారు. మరో మూడు పాటలను విదేశాలలో చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. కాగా ఈ వారంలో ఆడియోను, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|