'కుర్రాడు'తో చిరుత పిల్ల
తొలి సినిమా సక్సెస్ అయినప్పటికీ మలి సినిమా అందిపుచ్చుకోవడంలో ఒకింత వెనుకబడిన నేహాశర్మ ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. రామ్ చరణ్ 'చిరుత'తో ఢిల్లీ మోడల్ నేహాశర్మ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల సరైన అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు యువ సంచలనం వరుణ్ సందేష్ సరసన ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి వరుస హిట్లతో విజయపథంలో ఉన్న వరుణ్ కు ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. జెమినీ ఫిలిమ్స్ సర్క్యూట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కుర్రాడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. గుణ్ణం గంగరాజు తనయుడు గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'పొల్లధావన్' చిత్రానికి ఇది రేమేక్.
ఆసక్తికరంగా 'కుర్రాడు' చిత్రానికి అతి దగ్గరగా బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న 'రైడ్' చిత్రం (నానీ, తనీష్, శ్వేతాబసు ముఖ్యపాత్రధారులు)ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. రెండూ బైక్ చుట్టూ నడిచే కథాంశాలే కావడం ఓ దగ్గర పోలిక. ఆ మాటెలా ఉన్నా 'చిరుత' తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత తెలుగులో నటిస్తున్న నేహా 'కుర్రాడు'పై ఎక్కువ ఆశలే పెట్టుకుంది. ఈ చిత్రమైనా నేహాను టాలీవుడ్ లో బిజీ చేస్తుందా అనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|