మే ద్వితీయార్థంలో 'మగధీర'
సమ్మర్ సీజన్ లో సంచలనాలు సృష్టించేందుకు 'మగధీర' సిద్ధమవుతున్నాడు. 'చిరుత'తో అరంగేట్రం చేసిన రామ్ చరణ్ , హీరోయిజాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో నిష్ణాతుడైన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రియల్ స్టార్ శ్రీహరి ద్విపాత్రాభినయం చేస్తుంటం మరో విశేషం.
మాస్, యాక్షన్ అంశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందనీ, భారీ నిర్మాణ విలువులు, అత్యాధునిక సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయనీ అల్లు అరవింద్ చెబుతున్నారు. రామ్ చరణ్ ఇమేజ్ కు 'మగధీర' అతికినట్టు సరిపోతుందన్నారు. రాజస్థాన్, గుజరాత్ లలో కీలక సన్నివేశాలను అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించామనీ, అలాగే 'ఘరానా మొగుడు' చిత్రంలో సూపర్ డూపర్ హిట్టయిన 'బంగారు కోడిపెట్ట..' పాటను రీమిక్స్ సాంగ్ గా ఉందులో ఉపయోగించామనీ చెప్పారు. ఈ సాంగ్ లో చరణ్ తో చిరంజీవి కలిసి నృత్యం చేశారనీ, ప్రేక్షకులు, ముఖ్యంగా మెగాభిమానులకు ఈ సాంగ్ కన్నులపండువగా ఉంటుందనీ చెప్పారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సమ్మర్ కానుకగా మే ద్వితీయార్థంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ, రత్నం మాటలు, సెంధిల్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|