కొత్త హీరోతో జెనీలియా
జెనీలియా ఇప్పుడు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. 'బొమ్మరిల్లు' చిత్రం తెలుగులో జెనీలియా కెరీర్ ను మలుపుతిప్పితే, ఇదే చిత్రం తమళంలో 'సంతోష్ సుబ్రమణియం'గా విడుదలై విజయవంతమైంది. హిందీ రీమేక్ 'ఇట్స్ మై లైఫ్'లోనూ ఆమె కథానాయిక. ఇలా మూడు భాషల్లోనూ మెప్పుపొందుతున్న జెనీలియా హిందీలో ఈమధ్యనే విడుదలైన 'జానే తు య జానే న' హిట్ తో ఒక్కసారిగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం డేవిడ్ ధావన్ 'హుక్ య క్రూక్', తుషార్ తో 'లైఫ్ పార్టనర్' సినిమాల్లోనే ఆమె చేతిలో ఉన్నాయి. ఇంత బిజీలోనూ ఆమె తెలుగులో ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు నిర్మించనున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరోయిన్ చుట్టూ నడిచే ఈ కథాంశంలో జెనీలియా సరసన అరుణ్ కుమార్ (తమిళ 'హ్యాపీడేస్' ఫేమ్) అనే కొత్త యువకుడు పరిచయం కాబోతున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు.
జస్ట్ ఎల్లో పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ అనే యువదర్శకుడు పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఈనెల 26న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లో ప్రారంభం కానుంది. తదుపరి షెడ్యూల్ అరకులో ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు గుణ్ణం గంగరాజు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|