నెట్ లో 'ప్రయాణం' ఆడియో
'ఐతే', 'అనుకోకుండా', 'ఒక్కడున్నాడు' వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను అందించిన చంద్రశేఖర్ ఏలేటి ఈసారి నిర్మాతగా మారి ఓ విలక్షణ ఇతివృత్తంలో రూపొందిస్తున్న చిత్రం 'ప్రయాణం'. మంచు మనోజ్ కుమార్, హారిక (తొలి పరిచయం) జంటగా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కేవలం ఐదారు పాత్రలలో మలేషియా ఏర్ పోర్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని దర్శకనిర్మాత తీర్చిదిద్దారు. ఆసక్తికరంగా ఈ చిత్రం ఆడియోను వినూత్న తరహాలో విడుదల చేయబోతున్నారు. సహజంగా ఆడియో రీలీజ్ కార్యక్రమాలను లైవ్ స్టేజీల ద్వారా, టీవీ ఛానెల్స్, ఎఫ్ఎం రేడియోల ద్వారా విడుదలవుతుంటాయి. ఇందుకు భిన్నంగా నెట్ ద్వారా ఈనెల 27న ఆడియోను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత మార్కెట్ లోకి అడియో విడుదలవుతుంది. మార్కెట్ లోకి ఆడియో విడుదలకు ముందే సంగీత ప్రియులు నేరుగా ఈ పాటలను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
మహేష్ శంకర్ ('వెన్నెల' ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలేసియా నుంచి ఇండియాకి రావాలనుకున్న ఓ అమ్మాయి, అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాలనుకున్న ఓ అబ్బాయికీ మధ్య ఎయిర్ పోర్ట్ లో పరిచయమవుతుంది. వారిద్దరి మధ్య ఇంటరాక్షన్, కన్ఫూజన్లు...ఇలా సినిమా ఆద్యంతం సరదాగా ఉంటుందని ఏలేటి చెబుతున్నారు. మనోజ్, బెంగాలీ అమ్మాయి హారిక నటన, ప్రయాణంలో ప్యాసింజర్ గా కనిపించే బ్రహ్మానందం ప్రేక్షకులకు చక్కటి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తారనీ, సినిమాలో 70 శాతం విమానాశ్రయంలోనే నడుస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ మరో హైలైట్ కానుంది.
Be first to comment on this News / Article!
|