'బంగారుబాబు'కు క్లీన్ యు
జగపతిబాబు కథానాయకుడుగా డాక్టర్ దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లేతో రూపొందిన చిత్రం 'బంగారుబాబు'. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిందని దర్శకనిర్మాతలు తెలిపారు.
సినిమా చాలా బాగుందనీ, చక్కటి కుటుంబ కథా చిత్రమనీ సెన్సార్ సభ్యులు ప్రశంసించడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందనీ, ఆడియెన్స్ కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం తమకుందని రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై పెద్ద సక్సెస్ అయిందనీ, పాటల పిక్చరైజేషన్ కూడా బాగా కుదిరిందనీ అన్నారు. కార్మికుల పండుగైన మేడేన సినిమా విడుదల చేస్తున్నామనీ, తమ బ్యానర్ లో ఇదో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందనీ ఆయన అన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చిందనీస సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించడం హ్యాపీగా ఉందనీ అన్నారు. ఇంత మంచి బ్యానర్ లో నటించే అవకాశం రావడం తన అదృష్టమనీ, యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు, సక్సెస్ తెస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మీరాజాస్మిన్, శశాంక్ గౌరీముంజల్, మురళీ మోహన్, సాయాజీ షిండే, సోనూసూద్, జయసుధ, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, ధర్మవరపు, ఎల్బీ శ్రీరాం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించారు. శ్రీమతి దాసరి పద్మ సమర్పించిన ఈ చిత్రానికి మరుధూరి రాజా మాటలు, చంద్రబోస్, చిన్ని చిరణ్ పాటలు, రమణరాజు సినిమాటోగ్రఫీ, విజయ్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, బి.కృష్ణంరాజు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|