'శ్రీవారిముచ్చట్లు' ప్రారంభం
నూతర తారలు సుదీప్ బాబు, శ్రియా నారాయణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'శ్రీవారి ముచ్చట్లు'. పంకజ్ కుమార్ జైన్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమిత్ రాయ్ దర్శకుడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఫిలిం చాంబర్ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు క్లాప్ ఇచ్చారు. ఎస్.వి.కృష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రమని దర్శకుడు సుమిత్ రాయ్ తెలిపారు. ఇదే సంస్థలో తనకు రెండో చిత్రమని చెప్పారు. పట్నం వచ్చిన హీరో ప్రేమలో పడతాడు. అదే సమయంలో మరో అమ్మాయి కూడా హీరోకి దగ్గరవుతుంది. అయితే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లవుతుంది. భర్త విలువ తెలుసుకుని మళ్లీ అతనికి ఎలా దగ్గరయిందనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. నటనకు అవకాశమున్న పాత్రను ఇందులో పోషిస్తున్నట్టు సుదీప్ బాబు తెలుపగా, ప్రేమికురాలిగా, భార్యగా రెండు కోణాలున్న పాత్ర తనదని శ్రియానారాయణ్ పేర్కొంది. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజు నుంచి 25 రోజుల పాటు తొలి షెడ్యూల్ హైద్రాబాద్ లో జరుగుతుందనీ, మే ద్వితీయార్థంలో రెండో షెడ్యూల్ ఊటీలో చేస్తామనీ చెప్పారు. నటులు శివాజీరాజా, గుఫీ, నిర్మాతలో ఒకరైన మహేందర్ దరీవాలా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, దివ్వాదివేది, నాగబాబు, రామిరెడ్డి, జీవా, అన్నపూర్ణ, సురేఖావాణి, ఆర్.కె. తదితరులు నటించనున్నారు. ఆనంద్ సినిమాటోగ్రఫీ, శ్రీనివాస్ ఎడిటింగ్, నందు ఫైట్స్, రాహుల్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|