రవితేజతో బెల్లంకొండ చిత్రం
రవితేజ కథానాయకుడుగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నాని, తనీష్, శ్వేతబసుప్రసాద్ నటిస్తున్న 'రైడ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో ఓ చిత్రం ఉంటుందని ఆయన తెలిపారు. 'సింధూరం', 'ఖడ్గం' వంటి చిత్రాల తర్వాత రవితేజ-కృష్ణ వంశీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిదే.
సామాజిక అంశాలే కాకుండా కమర్షియల్ విలువలను కూడా జతచేసి సినిమాలను తీర్దిదిద్దే కృష్ణవంశీ, మాస్-క్లాస్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తమ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబోతున్నట్టు బెల్లంకొండ తెలిపారు. జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ఉప్పలపాటి రవి సహనిర్మాతగా వ్యవహరిస్తారు.
Be first to comment on this News / Article!
|