బ్యాంకాక్ బీచ్ లో 'కరెంట్'
నాగార్జున మేనల్లుడు సుశాంత్ ('కాళిదాసు' ఫేమ్), స్నేహ ఉల్లాల్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై రూపొందుతున్న 'కరెంట్' చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల పాటు బ్యాంకాక్ లో ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న యూనిట్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంది.
ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, బ్యాంకాక్ లో ఓ బీచ్ సాంగ్ ను ఇటీవల చిత్రీకరించామనీ, ఈనెల 29 నుండి హైద్రాబాద్ లోని వివిధ లొకేషన్లలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను 5 రోజుల పాటు చిత్రీకరించేందుకు ప్లాన్ చేశామని అన్నారు. మే 4 నుంచి సుశాంత్, స్నేహ ఉల్లాల్ జంటపై అన్నపూర్ణా స్టూడియోలో నిర్మిస్తున్న భారీ సెట్స్ లో మరో పాట చిత్రీకరిస్తామని చెప్పారు. దీంతో షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. మే మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేసి మే ద్వితీయార్థంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, షఫి, రఘుబాబు, సుధ, ఝాన్సీ, రష్మీ, కొండవలస తదితరులు నటిస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ, కనల్ కణ్ణన్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|