'క్షణం ఒక యుగం'
ఏ నిమిషం ఏమి జరుగుతుందోనని ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే యాక్షన్ థ్రిల్లర్ 'క్షణం ఒక యుగం'. సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తమిళం నుంచి తెలుగులో ఈ చిత్రం అనువాదమవుతోంది. మామణి దర్శకుడు. ఈ చిత్రాన్ని అల్తాఫ్ అహ్మద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అజయ్ - శ్రీశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి సుహాసిని సోదరి అనూహాసన్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్టుగానూ, రియాజ్ ఖన్ పోలీస్ కమిషన్ పాత్రను పోషించారు.
కొందరు దేశద్రోహులు ఓ శక్తివంతమైన బాంబుతో నగరంలో మహా విధ్వంసానికి ప్లాన్ చేస్తారు. ఒక యువకుడి కాలిబూట్లకు ఆ బాంబును అమరుస్తారు. అతడు అలసిపోయి పరిగెత్తలేక ఆగిపోయిన మరుక్షణం విధ్వంసం జరిగి లక్షల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించేలా కుట్ర పన్నుతారు. ఈ విద్రోహచర్య కారణంగా నగరంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? చివరకు పోలీసు అధికారులు ఆ విధ్వంసాన్ని ఎలా నివారించగలగారు? అనేదే ఈ చిత్ర కథాంశమని చిత్ర నిర్వాహకుడు ప్రసాద్ తెలిపారు. అనుక్షణం ఉత్కంఠ భరితంగా...'క్షణం ఒక యుగం'గా నడిచే ఈ చిత్రం యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని అమితంగా అలరిస్తుందని చెప్పారు. తమిళంలో ఈ చిత్రం మంచి సక్సెస్ అయిందనీ, తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామనీ చెప్పారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, మే రెండో వారంలో రాష్ట్రమంతటా సినిమా విడుదల చేస్తామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|