'అధినేత'కు ప్రేక్షకాదరణ
'అధినేత' చిత్రం చక్కటి ప్రజాదరణ చూరగొంటూ హౌస్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోందని ఆ చిత్ర నిర్మాత రాధామోహన్ పేర్కొన్నారు. జగపతిబాబు, శ్రద్ధాదాస్, హంసనందిని హీరోహీరోయిన్లుగా వి.సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారంనాడు చిత్రయూనిట్ నిర్వహించింది.
ఈ చిత్రాన్ని 108 ప్రింట్లతో 135 సెంటర్లలో విడుదల చేశామనీ, నేటికి ఐదవరోజుకు చేరుకున్న ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందనీ నిర్మాత తెలిపారు. కేవలం మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేయడం మామూలు విషయం కాదనీ, హీరో, దర్శకుడు...ఇలా ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారనీ చెప్పారు. పైరసీ రక్కని ప్రతి ఒక్కరూ అడ్డుకోవడంతో నేరుగా థియేటర్లలోనే సినిమా చూసి ఆనందించాలని ఆయన కోరారు. జగపతిబాబు మాట్లాడుతూ, ఇది మంచి సందేశాత్మక చిత్రమనీ, రాజకీయాల్లోకి యూత్ రావాలనీ, గెలిచిన అనంతరం నాయకులను రీకాల్ చేసే హక్కు కూడా జోటరుకు ఉండాలనీ ఇందులో చర్చించినట్టు చెప్పారు. ప్రతి ఓటరు చూడాల్సిన చిత్రమిదని అన్నారు. ఎక్కడా బడ్జెట్ గురించి ఆలోచించకుండా నిర్మాత ఎంతో కూల్ గా సినిమా తీశారనీ, అలాగే తన మొదటి సినిమాకి ఛాయాగ్రాహకుడుగా పనిచేసిన ప్రసాద్ బాబు మళ్లీ ఈ సినిమాకి చేశారనీ, ఆయన 80పైగా సినిమాలు చేసినా ఏమాత్రం స్పీడు తగ్గలేదని ప్రశంసించారు. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో 'అరుంధతి' తర్వాత మళ్లీ 'అధినేత'కు అంత మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. సమష్టి కృషితో ఈ చిత్రం మంచి విజయం సాధించిందని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, అన్నపూర్ణ, ఛాయాగ్రాహకుడు ప్రసాద్ బాబు, కళాదర్శకుడు ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|