'భవాని ఐపిఎస్'కు తెర
స్నేహ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'భవాని ఐపిఎస్'. కె.ఫిలిమ్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జి.కిచ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారంతో పూర్తయింది. షూటింగ్ స్పాట్ లోనే ఆ విశేషాలను దర్శకనిర్మాత కిచ్చ తెలియజేశారు.
తెలుగులో తాను తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాననీ, చక్కటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందనీ ఆయన చెప్పారు. స్నేహ పోలీసు అధికారిణిగా ఇంతవరకూ చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారనీ తెలిపారు. దాదాపు 48 రోజుల పాటు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్టు చెప్పారు. దిన సంగీతం అందించారనీ, ఇందులో ఐదు పాటలు ఉన్నాయనీ తెలిపారు. మే రెండో వారంలో ఆడియో, జూన్ మొదటివారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఛాయాగ్రాహకుడు కె.భూపతి మాట్లాడుతూ, గతంలో సాంకేతికపరంగా 'అంత:పురం' చిత్రం తనకు మంచిపేరు తెచ్చిందనీ, ఈ చిత్రం కూడా అంతటి పేరు తెస్తుందనే నమ్మకం ఉందనీ చెప్పారు. ఈ చిత్రంలో కిచకు కూడా తెలుగులో దర్శకుడిగా మంచిపేరు వస్తుందన్నారు. సాంకేతికంగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సంపత్ రాజ్, పొన్నాంబళం, రాజ్ కపూర్, ఇళవరసు, ఆర్యన్ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|