ఆలీ హీరోగా కొత్తచిత్రం
కమెడియన్ ఆలీ హీరోగా కూడా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న ఆలీ మరో కొత్త చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. కళాసాధన క్రియేషన్స్ బ్యానర్ పై రామ్.ఎస్.గోపాల్ ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. రచయిత మోహన్ రావు దురికి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరచయమవుతున్నారు.
పూర్తి హాస్యభరిత కథాశంతో ఈ చిత్రం ఉంటుందనీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, కొండవలస, రమాప్రభ, జయలలిత వంటి 30 మంది హాస్యతారాగణం ఈ చిత్రంలో ఉంటారనీ రామ్.ఎస్.గోపాల్ తెలిపారు. ఘంటాడి కృష్ణ సంగీతం అందించనున్నారనీ, జూన్ 4 నుంచి ఈ చిత్రం ప్రారంభమవుతుందనీ చెప్పారు. ఈ చిత్రంతో పాటు తమ సంస్థ ద్వితీయ చిత్రంగా 'ఆ వూరు దాటితే' అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని కూడా తీయబోతున్నట్ట ఆయన తెలిపారు. రాజు.ఎమ్.ఎన్. దర్శకత్వంలో ఈ చిత్రం ఉటుందన్నారు. ఐదు పాటలుంటే ఈ చిత్రానికి రజని సింధు సంగీతం సమకూరుస్తారనీ, నరసాపూర్, వికారాబాద్, తలకోన ఫారెస్ట్ లలో 40 రోజుల చిత్రీకరణతో సినిమాను పూర్తి చేస్తామని తెలిపారు. వరుస చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తొలి ప్రయత్నంగా 'శ్రీ సాయిగీతామృతం' పేరిట ఓ భక్తిగీతాల ఆడియో సీడీని కళాసాధన సంస్థ విడుదల చేసింది. రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తొలి సీడీని ఆలీ ఆష్కరించి హీరో సాయికిరణ్ కు అందించారు.
Be first to comment on this News / Article!
|