దాసరి బర్త్ డే ...అవార్డులు
క్రిష్ కు దాసరి అవార్డు
2008 సంవత్సరానికి దాసరి ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును 'గమ్యం' దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (క్రిష్) కు ప్రదానం చేయనున్నారు. అలాగే దాసరి ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును 'కొత్త బంగారులోకం' దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు, దాసరి ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్ అవార్డును బి.ఏ.రాజుకు దాసరి బర్త్ డే వేదిక నుంచే ప్రధానం చేస్తామని భరద్వాజ తెలిపారు. అవార్డు విజేతలకు సన్మానంతో పాటు తలో లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తామని చెప్పారు. ఇదే విధంగా పేద విద్యార్థులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఇదే వేదికపైన అందజేస్తామని తెలిపారు.
సినిమా అంటే 24 శాఖల సమష్టి కృషి ఫలితమనీ, ఆయా శాఖలలో పనిచేసిన సీనియర్లకు దాసరి ఆధ్వర్యంలో సత్కారం జరగనుండటం ఆనందదాయకమని దాసరి జన్మదినోత్సవ కమిటీ వైస్ చైర్మన్ రేలంగి నరసింహారావు తెలిపారు. దాసరి జన్మదినోత్సవాన్ని డైరెక్టర్స్ డే గా జరుపుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం కార్యదర్శి రాంప్రసాద్, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి వేణుగోపాలరావు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|