'నేనున్నా...నీకోసం'
నృత్య దర్శకులు నటులుగా, దర్శకులుగా కూడా రాణిస్తారు. ఇప్పుడు మరో నృత్య దర్శకుడు రాంజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నారు. 'నేనున్నా నీకోసం' అనే కొత్త చిత్రంలో ఒక హీరోగా నటిస్తూ దర్శకుడిగా కూడా మారారు. ఎస్.ఎస్.ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నందకిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నందకిషోర్ , ప్రేమిక, నాజ్, జార, జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హైద్రాబాద్ లోని బోరబండ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ క్లాప్ ఇవ్వగా, డిఎస్పీ సాంబయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. 'ప్రేమకు దేవుడి సహకారం ఉంటేనే అది విజయవంతమవుతుందిరా' అనే డైలాగ్ ను తొలిషాట్ గా చిత్రీకరించారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వివిధ భాషల్లో 100కు పైగా సినిమాలకు తాను నృత్యదర్శకత్వం వహించాననీ, తొలిసారిగా తాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొత్త పాత నటీనటులు ఉంటారని చెప్పారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందన్నారు. లవ్, సెంటిమెంట్, యాక్షన్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు. విశాఖ, రాజమండ్రి. అరకులలో షూటింగ్ చేస్తామనీ, సెప్టెంబర్ లో సినిమా విడులకు ప్లాన్ చేస్తున్నామనీ నందకిషోర్ తెలిపారు. తనతో పాటు రాజేంద్రప్రసాద్ కూడా హీరోగా నటిస్తున్నారని తెలిపారు.
Be first to comment on this News / Article!
|