ఏడుగురు దర్శకులతో చిత్రం
ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. 24 శాఖలనూ సమన్వయ పరిచి అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించే కీలక బాధ్యత దర్శకుడిదే. ఒకే సినిమాను ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కించిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అయితే తొలిసారిగా ఏడుగురు ప్రముఖ దర్శకులు కలిసి ప్రయోగాత్మకంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో ఏడుగురు హీరోయిన్లు కూడా ఉంటారు. పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి ఆ తర్వాత రియాల్టర్ గా మారిన ఇనగడప సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని సెవన్ హిల్స్ ఎంటర్ టైనర్స్ పతాకంపై నిర్మించబోతున్నారు.
ప్రయోగాత్మకంగా ఈ చిత్రం ఉంటుందనీ, మే మూడోవారంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తామనీ సతీష్ కుమార్ తెలిపారు. ఏడాదికి కనీసం రెండు చిత్రాలు తమ సంస్థ ద్వారా నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న సురేష్ మాట్లాడుతూ తెలుగులో తొలిసారిగా ఏడుగురు ప్రముఖ దర్శకులు, ఏడు ప్రేమకథలు, ఏడుగురు హీరోయిన్లతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు చెప్పారు. వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. పూర్తి వివరాలను సినిమా ప్రారంభోత్సవం రోజున తెలియజేస్తామని అన్నారు.
Be first to comment on this News / Article!
|