'ఎ లెజెండ్రీ యాక్ట్రస్ సావిత్రి'
మహానటి సావిత్ర నేటికీ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు. ఎన్నో విలక్షణ పాత్రలకు జీవం పోసిన సావిత్రి ముందుతరాల నటీమణులకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోనే గాకుండా ఖండాతరాల్లలో కూడా ఆమెకు అభిమానులున్నారు. న్యూయార్క్ లోని జేమ్స్ విల్లీకి చెందిన ప్రవాసాంధ్రులు వి.ఆర్.మూర్తి, వి.సోమరాజు సంయుక్తంగా సావిత్రి జీవిత చరిత్రను 'ఎ లెంజండరీ యాక్ట్రస్ మహానటి సావిత్రి' పేరుతో రచించారు. ఆ పుస్కకావిష్కరణ కార్యక్రమం ఈనెల 4న డాక్టర్ దాసరి నారాయణరావు చేతులమీదుగా జరుగుతుంది.
దాసరి నారాయణరావు ఈ పుస్కకానికి ముందు మాట రాశారు. పుస్తకావిష్కరణ అనంతరం తొలి ప్రతిని సావిత్రి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరికి అందజేస్తారు. విజయవాడకు చెందిన మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి పరుచూరి విజయలక్ష్మి, మురళి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని దాసరి నారాయణరావు స్వగృహంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది.
Be first to comment on this News / Article!
|