లడఖ్ లో 'పిస్తా'
విశాల్, శ్రియ జంటగా జె.కె.ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై సభా అయ్యప్ప దర్శకత్వంలో విక్రమ్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'పిస్తా'. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుంత కాశ్మీర్, లడఖ్ పరిసరాల్లో ఆ పాట చిత్రీకరణ జరుగుతుంది.
హీరో విశాల్ ఈ చిత్రం ప్రోగ్రస్ ను తెలియజేస్తూ, ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ, తెలుగులో తాను నటిస్తున్న రెండో చిత్రమిదనీ చెప్పారు. తమిళంలో 'తోరణి' అనే పేరు పెట్టామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం కలిగిన యువకుడు విశాఖ చేరుకున్న తర్వాత కథ ఏ విధంగా మలుపులు తిరిగిందనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. తన పాత్ర యాక్షన్ తో పాటు వినోదాన్ని కూడా పంచుతుందన్నారు. తొలిసారిగా తాను ప్రకాష్ రాజ్ తో కలిసి నటిస్తున్నానని అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇది ఓ అపార్ట్ మెంట్ లో జరిగే కథనీ, గ్రామం నుంచి వచ్చిన యువకుడు అపార్ట్ మెంట్ సంస్కృతికి ఎలా మారాడన్నది ఆసక్తికరంగా ఉంటుందనీ నిర్మాత విక్రమ్ కృష్ణ వివరించాచుర. ఇదే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణ, కొండలవలస, తెలంగాణ శకుతంల, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్నారు. శశాంక్ మాటలు, సాహితి-అనంత శ్రీరామ్ పాటలు, రాఖీ ముఖేష్ ఫైట్స్, ప్రియన్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|