11 నెలల్లో 3 హిట్లు
పదకొండు నెలల కాలంలో 3 వరుస సక్సెస్ లతో తమ సంస్థ విజయఢంకా మోగించిందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ తో తీసిన 'పరుగు', వరుణ్ సందేశ్ 'కొత్తబంగారులోకం', త్రిష-ప్రకాష్ రాజ్ ల 'ఆకాశమంత' చిత్రాలు వరుస విజయాలు సాధించి తమకు హ్యాట్రిక్ అందించాయని ఆయన తెలిపారు. ఈ చిత్రాల సక్సెస్ ను శుక్రవారంనాడు ఆయన మీడియాతో పంచుకున్నారు. కుటంబంలోని భావోద్వాగాల చుట్టూ అల్లుకున్న ఈ మూడు కథాచిత్రాలను ప్రేక్షకులను ఆదరించడం ఆనందంగా ఉందనీ, ఈ చిత్రాల సక్సెస్ క్రెడిట్ దర్శకులకు చెందుతుందని అన్నారు.
ప్రస్తుతం తాను నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ వాసువర్మ దర్శకత్వంలో ఒక చిత్రం, రవియాదవ్ దర్శకత్వంలో 'మరోచరిత్ర' రీమేక్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు రామ్ ('రెడీ' ఫేమ్) శ్రీవాస్ దర్శకత్వంలో 'రామ రామ...కృష్ణ కృష్ణ', ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఎన్టీఆర్ హీరోగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. 'ఆర్య' సినిమా నుంచి తమ సంస్థకు పనిచేస్తున్న వేణు శ్రీరామ్, ప్రకాష్ లను కూడా దర్శకులుగా పరిచయం చేస్తామని ప్రకటించారు. తమ అనుబంధ సంస్థ అయిన 'మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్' సంస్థతో కలిసి ఏడాదికి కనీసం 3 చిత్రాలైనా నిర్మించాలని నిశ్చయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, వాసువర్మ, రాధామోహన్, వంశీ పైడిపల్లి, వేణుశ్రీరామ్, ప్రకాష్ లతో పాటు శిరీష్-లక్ష్మణ్ పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|