ఇంటివాడైన శివారెడ్డి
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, హాస్యనటులలో అజాత శత్రువుగా పేరున్న శివారెడ్డి ఆదివారంనాడు ఓ ఇంటివాడయ్యారు. సిద్ధపేటకు చెందిన వి.తిరుపతిరెడ్డి కుమార్తె స్వాతితో శనివారంనాడు ఆయన వివాహం వేడుకగా జరిగింది. సిద్ధిపేటలోని సీసీ గారెడన్స్ లో జరిగిన ఈ వివాహానికి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఏవియస్, గుండు హనుమంతరావు, ఆలీ, అనంత్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.
ప్రపంచ హాస్యదినోత్సవం రోజునే తన పెళ్లిజరగడం సంతోషంగా ఉందనీ, నిజానికి పెద్దలు గుర్తు చేసే వరకూ తనకు కూడా ఈరోజు విశిష్టత తెలియలేదనీ శివారెడ్డి పేర్కొన్నారు. ఇది తన జీవితంలో ఎంతో అపూరూపమైన రోజని అన్నారు. అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతున్న నవ్వులరేడు తన భర్తగా లభించడం అదృష్టమని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కంటే ఆనందం మరొకటి ఉండదని స్వాతి తన సంబరాన్ని వ్యక్తం చేసింది.
Be first to comment on this News / Article!
|