మీనా పెళ్లి జూలై 12న
నటి మీనా (33) ఎట్టకేలకు పెద్దలు కుదిర్చిన వివాహంతో జీవితంలో సెటిల్ కానుంది. మీనా తల్లి పెట్టే ఆంక్షల వల్లే ఆమెకు పెళ్లి సంబంధాలు ఎప్పటికప్పుడు చెడిపోతున్నాయనీ, కనీసం పదిసార్లు అయినా ఇలా జరిగి ఉండొచ్చనీ కొద్దిరోజుల క్రితమే పలు గాసిప్స్ బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ గాసిప్స్ కు తెరపడింది. మీనా వివాహ నిశ్చితార్ధం ఇటీవల చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. బెంగుళూరుకు చెందిన బిజినెస్ మన్ విద్యాసాగర్ తో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ నిశ్చితార్ధం జరిగింది. జూలై 12 వివాహ ముహూర్తాన్ని పెద్దలు నిశ్చయించారు.
ఆరేళ్ల ప్రాయంలోనే మీనా 'నెంజంగల్' అనే చిత్రంలో బాల నటిగా పరిచయమమైంది. ఆ తర్వాత ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల్లో ఆమె బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. 'సీతారామయ్య గారి మనుమరాలు' చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ అందిరితోనూ నటించిన మీనా తమిళంలోనూ అగ్రహీరోలందరితోనూ నటించారు. మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటిగా మంచిపేరు తెచ్చుకున్నారు. దాదాపు 150 చిత్రాల్లో నటించిన మీనా ఆ మధ్య హీరోయిన్ గా కొద్ది గ్యాప్ వచ్చినా మళ్లీ రజనీకాంత్ 'కథానాయకుడు'లో ఇటీవల నటించారు. తాజాగా ఆమె తెలుగులో 'వెంగమాంబ' అనే భక్తి ప్రధాన చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. వివాహ ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని త్వరలోనే మీనా పూర్తి చేయనుంది. విహానంతరం మీనా మళ్లీ నటిస్తుందా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఆల్ ద బెస్ట్ మీనా..
Be first to comment on this News / Article!
|