ఆర్తి అగర్వాల్ కొత్తచిత్రం
'నువ్వు నాకు నచ్చావ్', 'ఇంద్ర', 'నీ స్నేహం', 'గోరింటాకు' చిత్రాల కథానాయిక ఆర్తి అగర్వాల్ నటిగా మరో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆర్తి మళ్లీ రెగ్యులర్ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆర్తి కథానాయికగా ఆల్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సస్పెన్స్ థిల్లర్ చిత్రం జూలైలో ప్రారంభం కానుంది. టి.మోహన్ రెడ్డి (యుఎస్ఎ) సి.హెచ్.సుధాకర్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సుధాకర్ బాబు ఈ చిత్ర విశేషాలను తెలియజేస్తూ, తెలుగులో మళ్లీ రీఎంట్రీ అవుతున్న ఆర్తి అగర్వాల్ నటించే హీరోయిన్ ఓరియెంటెడ్ కథాచిత్రమిదనీ, ఈ సినిమా కోసం ఆర్తి చాలా స్లిమ్ గా మారారనీ చెప్పారు. జూన్ లో షూటింగ్ ప్రారంభించి చెన్నై, హైద్రాబాద్ లలో జరిగే సింగిల్ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణల వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఆర్తి అగర్వాల్ మాట్లాడుతూ, దర్శకుడు ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో నాలుగైదు అవకాశాలు వచ్చినప్పటికీ రీ-ఎంట్రీకి ఇదే సరైన స్క్రిప్ట్ అని తాను భావించి ఈ సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారు. తన గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా ఇది ఉంటుందన్నారు.
Be first to comment on this News / Article!
|