యశోసాగర్ కు మరో సినిమా
యశోసాగర్ హీరోగా 'ఉల్లాసంగా ఉత్సాహంగా' అనే సక్సెస్ ఫుల్ చిత్రాన్ని నిర్మించిన అమృత్ అమర్ నాథ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులోనూ యశోసాగర్ హీరోగా నటించనున్నారు. 'ఆర్య' దర్శకుడు సుకుమార్, 'మంత్ర' తులసీరామ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎన్.ఎస్.నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బి.పి.సోము నిర్మాత.
జూన్ లో ఈ కొత్త చిత్రం ప్రారంభమవుతుందనీ, 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రానికి సంగీతం అందించిన జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ పి తెలిపారు. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందనీ, మంచి మ్యూజికల్ గా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|