రెండు భాషల్లో తులసి ఫిలింస్
తులసి ఫిలిం కంపెనీ తెలుగు, హిందీ భాషల్లో నూతన తారలతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్ ఘోయల్, అరోరా, మాన్సీ, సాక్షి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బి.పప్పు దర్శకత్వంలో యస్.కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం పద్మాలయా స్టూడియోస్ లో సోమవారంనాడు జరిగింది. హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తం సన్నివేశానికి దర్శకనిర్మాత వి.సాగర్ క్లాప్ ఇవ్వగా, శివకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
యూత్ కు సందేశాన్నిచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని మలుస్తున్నట్టు దర్శకుడు పప్పు తెలిపారు. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఇందులో నాలుగు పాటలున్నాయనీ, ఆస్ట్రేలియా, మారిషస్, సింగపూర్ లలో చిత్రీకరణ జరుపుతామని చెప్పారు. ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూన్ వరకూ ఉంటుందనీ, జూలైలో సినిమా విడుదల చేస్తామనీ చెప్పారు. ఈ చిత్రానికి బి.పప్పు కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, ఎస్.జహంగీర్ సినిమాటోగ్రఫీ, పొందూరి మాటలు-పాటలు, విజయ్ నంగ్లే ఎడిటింగ్, ప్రవీణ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|